అఫ్గాన్‎పై రెండో టెస్ట్‌‌లో విజయం.. జింబాబ్వేదే టెస్ట్‌‌ సిరీస్‌‌

అఫ్గాన్‎పై రెండో టెస్ట్‌‌లో విజయం.. జింబాబ్వేదే టెస్ట్‌‌ సిరీస్‌‌

షార్జా: అఫ్గానిస్తాన్‌‌తో జరిగిన రెండో టెస్ట్‌‌లో జింబాబ్వే 57 రన్స్‌‌ తేడాతో గెలిచింది. దాంతో రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను జింబాబ్వే 1–0తో కైవసం చేసుకుంది. జింబాబ్వే నిర్దేశించిన 418 రన్స్‌‌ లక్ష్య ఛేదనలో భాగంగా 143/5 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో మంగళవారం ఐదో రోజు ఆట కొనసాగించిన అఫ్గాన్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 130.3 ఓవర్లలో 360 రన్స్‌‌కు ఆలౌటైంది. నసీర్‌‌ ఖాన్‌‌ (101 నాటౌట్‌‌), అఫ్సర్‌‌ జజాయ్‌‌ (87), మహ్మద్‌‌ సలీమ్‌‌ (22) చివరి వరకు పోరాడి విఫలమయ్యారు.